‘ఆచారి అమెరికా యాత్ర’ - బైక్ చేజింగ్ ఫైట్

Thursday,April 26,2018 - 01:35 by Z_CLU

రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’. అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు మంచు విష్ణు షేర్ చేసిన ఆక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో ఫాస్ట్ పేజ్ లో సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన మంచు విష్ణు ‘స్టంట్స్ ప్రతిసారి సేఫ్ కాదు, ఆల్మోస్ట్ నా తల పగిలిపోయేది..” అంటూ పెట్టిన ట్వీట్, ఈ సినిమా టీమ్ డెడికేషన్ ని ఎలివేట్ చేస్తుంది.

బ్రహ్మానందం ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో హిలేరియస్ ఎలిమెంట్స్ తో పాటు, ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ కానున్నాయి తెలుస్తుంది.  ఇటివలే రిలీజైన ఈ బైక్ చేజింగ్ ఆక్సిడెంట్ వీడియో, సినిమాలో ఎలా ఉండబోతుందోనన్న క్యూరియాసిటీ రేజ్ అవుతోంది.

G. నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ ప్లే చేస్తున్నాడు. పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాని కీర్తి చౌదరి, కిట్టు నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్.