బాలీవుడ్ టాప్-10లో సాహో

Thursday,September 05,2019 - 11:10 by Z_CLU

ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది సాహో. ఈ ఇయర్ హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన టాప్-10 చిత్రాల్లో ఈ సినిమా కూడా చేరింది. అలా సల్మాన్, అక్షయ్, హృతిక్ సరసన ప్రభాస్ కూడా చేరిపోయాడు.

ఈ ఇయర్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది కబీర్ సింగ్. షాహిద్ నటించిన ఈ సినిమాకు ఇండియాలో 278 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో 244 కోట్ల రూపాయలతో యూరి సినిమా నిలిచింది. ప్రస్తుతం 103 కోట్ల రూపాయల వసూళ్లతో పదో స్థానంలో కొనసాగుతోంది సాహో. కంప్లీట్ రన్ లో ఇది ఏ స్థానంలో సెటిల్ అవుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

2019 బాలీవుడ్ టాప్-10 మూవీస్
1. కబీర్ సింగ్ – రూ. 278.24 కోట్లు
2. యూరి – రూ. 244.33 కోట్లు
3. భారత్ – రూ. 211.31 కోట్లు
4. మిషన్ మంగళ్ – రూ. 189.50 కోట్లు
5. కేశరి – రూ. 154.50 కోట్లు
6. టోటల్ ధమాల్ – రూ. 154.23 కోట్లు
7. సూపర్ 30 – రూ. 146.92 కోట్లు
8. గల్లీ బాయ్ – రూ. 140.25 కోట్లు
9. దే దే ప్యార్ దే – రూ. 103.64 కోట్లు
10. సాహో – రూ. 103.21 కోట్లు