ఇస్మార్ట్ శంకర్ – సక్సెస్ ఫుల్ గా 50 రోజులు

Thursday,September 05,2019 - 10:12 by Z_CLU

రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించిన సినిమా.. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ గా ఫ్యాన్స్ లో ఇమేజ్ ఉన్న ఈ హీరోని  ‘అవకాశం దొరకాలి కానీ ఎలాంటి క్యారెక్టర్ లోనైనా రామ్ ఇరగదీస్తాడు’ అని నిరూపించిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా ఈరోజు సక్సెస్ ఫుల్ గా 50వ రోజులోకి అడుగుపెట్టింది.

రామ్.. పూరి కాంబినేషన్ అనగానే ఎక్స్ పెక్టే షన్స్ సెట్ అయ్యాయి. కానీ వాటికన్నా ఎక్కువగా ఆడియెన్స్ లో క్యూరియాసిటీ  జెనెరేట్ అయింది. పూరి హీరో అంటేనే ఓ మార్క్. అలాంటిది అప్పటివరకు హార్ట్ టచింగ్ కథలను ఎంచుకుంటూ ఫ్యాన్స్ లో ఓ పర్టికులర్ ఇమేజ్ ఉన్న రామ్ .. పూరి హీరోలా ఏం చేయబోతున్నాడా అని ఫ్యాన్స్ చాలా ఈగర్ వెయిట్ చేశారు. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైయినప్పుడే సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైబ్స్ క్రియేట్ అయ్యాయి.

రిలీజ్ తరవాత కూడా అదే క్రేజ్ కొనసాగింది. వర్త్ వెయిటింగ్ అనిపించుకుంది ఇస్మార్ట్ శంకర్. ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ అందుకుంటే.. సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకునేంత వరకు ఎక్కడా ఆగలేదు. ఈ సక్సెస్ ఊపులోనే ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి.. దీని సీక్వెల్ కూడా అనౌన్స్ చేసేశాడు. అంతగా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. రామ్ కెరీర్ ల ో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.