రేపే సాహో ఫస్ట్ సింగిల్

Sunday,July 07,2019 - 09:34 by Z_CLU

సాహో సాంగ్స్ రిలీజ్ ప్రొగ్రామ్ మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ కు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి సంబంధించిన లిరికల్ వీడియోను రేపు రిలీజ్ చేయబోతున్నారు.

సైకొ సైయాన్ అని స్టార్ట‌య్యే ఈ సాంగ్ పూర్తి లిరిక‌ల్ వీడియో కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాటకు తనిష్క్ బాగ్చీ సంగీతం అందించాడు.

యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్.

ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌ల కి సిద్ధ‌మౌతోంది.