నాని సినిమాలో ‘RX 100’ సినిమా హీరో

Wednesday,February 06,2019 - 06:22 by Z_CLU

ఒక్క సినిమాతోనే కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్నాడు RX 100 హీరో కార్తికేయ. ఈ సినిమా తరవాత కూడా మరీ హడావిడి పడకుండా చూజీగా కథల్ని ఎంచుకుంటూ కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు సడెన్ గా నాని సినిమాలో కార్తికేయ కూడా నటిస్తున్నాడనే టాక్ టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ విషయంపై ఇంకొంచెం ట్రై చేస్తే, మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ దృష్టికి వచ్చింది.

రీసెంట్ గా దర్శకుడు విక్రమ్ కుమార్ కార్తికేయని తన నెక్స్ట్ సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించమని అడిగాడట. ఆల్మోస్ట్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది ఎక్స్ ప్లేన్ కూడా చేశాడట. దానికి కార్తికేయ ఎలా రియాక్ట్ అయ్యాడు…? ఒప్పుకున్నాడా లేదా..? అనే డీటేల్స్ అయితే ప్రస్తుతానికి బయటికి రాలేదు  కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త చుట్టూ ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్స్ జరుగుతున్నాయి.

మరి విక్రమ్ కుమార్ నిజంగానే కార్తికేయని అప్రోచ్ అయ్యాడా లేదా..? లేకపోతే ఇది జస్ట్ రూమరేనా అనేది తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా ఆగాల్సిందే. మ్యాగ్జిమం ఫిబ్రవరిలోనే సినిమాని సెట్స్ పైకి తీసుకురానున్న మేకర్స్, సినిమాకి సంబంధించిన తక్కిన డీటేల్స్ త్వరలో అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.