Viral Post.. పెళ్లిపై హింట్ ఇచ్చినట్టేనా..!

Thursday,June 18,2020 - 02:00 by Z_CLU

మెగా డాటర్ నిహారిక కొణెదల పెళ్లి.. కొన్ని నెలలుగా ఇదొక ట్రెండింగ్ టాపిక్. ఎప్పటికప్పుడు ఆమె వెడ్డింగ్ పై రూమర్లు వస్తూనే ఉన్నాయి. వాటిని నాగబాబు, నిహారిక ఖండిస్తూనే ఉన్నారు. అయితే ఈసారి మాత్రం విషయం వేరు. స్వయంగా నిహారిక పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

స్టార్ బక్స్ కాఫీ కప్ పై “మిస్ నిహా” (నిహారిక ముద్దుపేరు) అని రాసి ఉంది. అందులో Ms అనే పేరును కొట్టేసి, దానికింద Mrs అనే పేరు రాసింది నిహారిక. కాకపోతే చివర్లో క్వశ్చన్ మార్క్ పెట్టింది.

ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిహారిక పెళ్లికి రెడీ అంటూ ప్రచారం నడుస్తోంది. అటు నాగబాబు కూడా ఇది వరకే తన కూతురు పెళ్లిపై రెస్పాండ్ అయ్యారు. వచ్చే ఏడాది మే నెలలోపు పెళ్లి చేసేస్తామని ప్రకటించారు.

నిహారిక పెట్టిన ఈ పోస్టుతో మరోసారి ఆమె మ్యారేజ్ పై రూమర్స్ ఎక్కువయ్యాయి. గుంటూరుకు చెందిన ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తితో నిహారిక పెళ్లి జరగబోతోందంటూ కొత్తగా మరో ప్రచారం ఊపందుకుంది.