#RRR ట్రయల్ షూట్ వాయిదా

Thursday,June 18,2020 - 02:56 by Z_CLU

ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి తీస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘RRR’. ఈ సినిమా ట్రయల్ షూట్ పోస్ట్ పోన్ అయింది.

ప్రభుత్వం షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వడంతో మళ్ళీ సెట్స్ పైకి రావాలని భావించింది యూనిట్. ప్రభుత్వ నిబంధనలతో ట్రయల్ షూట్ చేయాలనుకున్నాడు రాజమౌళి. అన్నీ సిద్దం చేసుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ట్రయిల్ షూట్ ను పోస్ట్ పోన్ చేశారు.

ప్రభుత్వ నిబంధనల మేరకు తక్కువ మందితో ఈ సినిమా షూట్ చేయడం వీలుపడగ ట్రయిల్ షూట్ వాయిదా వేసుకున్నారని ఇన్ సైడ్ టాక్. పైగా హైదరాబాద్ లో రోజురోజుకు కరోనా కేసులు మరిన్ని పెరుగుతుండడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక ప్రస్తుతానికి ట్రయల్ షూట్ ను పోస్ట్ పోన్ చేశారు.

గ్రాండియర్ గా సినిమా తీసే జక్కన్నకు లిమిటెడ్ క్రూ తో షూటింగ్ చేయడం కష్టమే మరి. పైగా వాతావరణం కూడా అనుకూలించే పరిస్థితి లేదు. తెలంగాణాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. అది కూడా షూట్ పోస్ట్ పోన్ కు ఒక కారణమనుకోవచ్చు.