అలియాభట్ పై క్లారిటీ ఇచ్చిన ఆర్ఆర్ఆర్

Sunday,March 22,2020 - 01:19 by Z_CLU

ఆర్ఆర్ఆర్ నుంచి అలియా భట్ తప్పుకుందట
రాజమౌళి ఇప్పుడు మరో హీరోయిన్ కోసం సెర్చింగ్
2 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్టికల్ ఇది. ఇందులో నిజమెంతో తెలుసుకుందామంటే యూనిట్ అందుబాటులోకి రాలేదు. అంతా కరోనా కారణంగా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ లో అలియాభట్ పై క్లారిటీ వచ్చేసింది.

ఇప్పటివరకు వస్తున్న రూమర్స్ అన్నీ కేవలం గాసిప్స్ అని కొట్టిపారేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. అలియా భట్ ఇప్పటివరకు సెట్స్ పైకి రాలేదనే విషయాన్ని ఒప్పుకున్న యూనిట్.. ఏప్రిల్ థర్డ్ వీక్ లేదా మే నుంచి అలియా సెట్స్ పైకి వస్తుందని క్లారిటీ ఇచ్చింది.

సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ కోసం ఓ విదేశీ ముద్దుగుమ్మను తీసుకున్నారు. ఆమె సెట్స్ పైకి రాకుండానే హ్యాండ్ ఇచ్చింది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకున్నారు. ఇప్పుడు చరణ్ హీరోయిన్ అలియా భట్ కూడా సెట్స్ పైకి రాకుండానే హ్యాండ్ ఇచ్చిందని చాలామంది అనుకున్నారు.

కానీ తమ సినిమాలో అలియా భట్ ఉందని క్లారిటీ ఇచ్చింది ఆర్ఆర్ఆర్ యూనిట్. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతోంది.