నితిన్ నిర్మాతగా అఖిల్ సినిమా?

Sunday,March 22,2020 - 01:06 by Z_CLU

అఖిల్ ను హీరోగా పరిచయం చేసింది నితినే. తన సొంత బ్యానర్ పై అఖిల్ హీరోగా సినిమా నిర్మించాడు నితిన్. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి కలవబోతోంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే నితిన్ నిర్మాతగా అఖిల్ హీరోగా మరో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.

ఈసారి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించే ఛాన్స్ ఉందంటూ గాసిప్స్ వస్తున్నాయి. శ్రేష్ణ్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మాతగా (నితిన్ తండ్రి) ఈ సినిమా నిర్మిస్తాడని ఫిలింనగర్ టాక్.

అంతా బాగానే ఉంది కానీ ఈ కాంబినేషన్ ఇప్పట్లో తెరపైకి వస్తుందా అనేది అందరి డౌట్. ఎందుకంటే ప్రస్తుతం నితిన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 3 సినిమాలు చేస్తున్నాడు. ఇక అఖిల్ కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతో ప్రస్తుతానికి బిజీగా ఉన్నాడు.

సో.. ఈ కాంబినేషన్ అనేది ప్రస్తుతానికి గాసిప్ లెవెల్లోనే ఉంది. కానీ నిజమవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ మరి.