ఆర్-ఆర్-ఆర్.. ఈసారి మరింత పెద్దగా

Thursday,March 21,2019 - 11:38 by Z_CLU

ఇప్పటివరకు జరిగింది ఒకెత్తు.. ఇకపై జరగబోయేది మరో ఎత్తు.
అవును.. ఆర్-ఆర్-ఆర్ షూటింగ్ ఊపందుకుంది. మొన్నటివరకు హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ చేశారు. అది కూడా కాస్త నెమ్మదిగా. ఈసారి మాత్రం సినిమా షూటింగ్ ను పరుగులెత్తించబోతున్నారు. ఈ సినిమా కోసం 30 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. పూణెలో ఇవాళ్టి నుంచి అది స్టార్ట్ అయింది

ఈ షెడ్యూల్ లో పాల్గొనేందుకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పూణె వెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా సెట్ వేశారా, లేక అడవుల్లో షూటింగ్ చేస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

ఆర్-ఆర్-ఆర్ లో హీరోయిన్ గా సెలక్ట్ అయిన అలియాభట్, ఈ షెడ్యూల్ లోనే జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ మాత్రం పూణె షెడ్యూల్ లో జాయిన్ అవుతున్నాడు.

ఈ సినిమాలో యంగ్ అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. వాళ్ల గెటప్స్ మనం ఊహించినట్టు మాత్రం ఉండవు. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.