ఇంకో స్టార్ పేరు కూడా మారింది...

Thursday,March 21,2019 - 11:57 by Z_CLU

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ పేరు మారింది. అంటే… ఆ పేరును పూర్తిగా చేంజ్ చేసేసి ఇంకో పేరు పెట్టుకోవడం  లాంటిది కాదు. సాయి ధరమ్ తేజ్ నుండి ఇకపై ధరమ్ సైలెంట్ కానుంది. అంటే ఇకనుండి జస్ట్ సాయి తేజ్ గా పిలవబడతాడు. ఇప్పుడు సెట్స్ పై ఉన్న ‘చిత్రలహరి’ సినిమా టైటిల్ కార్డ్స్ లో కూడా సాయి తేజ్ అనే పేరునే రాసుకున్నారు మేకర్స్. ఈ సినిమా టీజర్ లో ఆ చేంజెస్  మనం చూడొచ్చు.

సినిమా ఇండస్ట్రీకి సెంటిమెంట్స్ కామనే. ఓ మోస్తరుగా వెళ్తున్న కరియర్ కి గట్టి బ్రేక్ రావాలంటే ఎంతో కొంత పేరు మార్చుకోవాలనే నమ్మకం ఉంది. ఈ నియమాన్ని గతంలో పవర్ స్టార్ కూడా ఫాలో అయ్యాడు. అంతెందుకు పవన్ కళ్యాణ్ లాంచ్ అయిన సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలో టైటిల్ కార్డ్స్ లో ‘కళ్యాణ్ బాబు’ అని పేరే ఉంటుంది, ఆ తర్వాతే అది పవన్ కళ్యాణ్ అయింది.

మెగా పవర్ స్టార్ విషయంలో కూడా అదే జరిగింది. రామ్ చరణ్ తేజ్ గా ఇంట్రడ్యూస్ అయిన చెర్రీ, ఇప్పుడు జస్ట్ రామ్ చరణ్ గా ఫిక్సయ్యాడు. ఇదే వరసలో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ కూడా రామ్ శంకర్ గా పిలిపించుకుంటున్నాడు.

అంతెందుకు సీనియర్ నటుడు నరేష్ కూడా టైటిల్ కార్డ్స్ లో డా. విజయ కృష్ణ నరేష్ గా, సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ ఆ మధ్య కళ్యాణ్ రమణ గా పిలిపించుకున్నా, చివరికి కళ్యాణ్ కోడూరిగా సెటిలయ్యాడు. మరో హీరో ఆది కూడా రీసెంట్ సినిమాల నుండి ఆది సాయికుమార్ గా పిలించుకున్నాడు.