#RowdyBoys సెకండ్ సాంగ్ రిలీజ్ చేసిన రౌడీ !

Thursday,October 21,2021 - 11:28 by Z_CLU

దిల్ రాజు ఫ్యామిలీ నుండి శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ‘రౌడీ బాయ్స్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఫస్ట్ సింగిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఆల్బంలోని రెండో పాటను వదిలారు. ఈ లిరికల్ సాంగ్ ని రౌడీ విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు.

ఇప్పటికే సినిమాలోని టైటిల్ సాంగ్ ఓ రేంజ్ లో క్లిక్ అయింది. ప్రస్తుతం కుర్రాళ్ళకి ఓ బ్రాండ్ సాంగ్ లా మారిపోయింది. తాజాగా రిలీజయిన “ప్రేమే ఆకాశమైతే” సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటూ మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్ చేస్తూ మంచి వ్యూస్ అందుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ లవ్ సాంగ్ కి శ్రీమణి లిరిక్స్ అందించాడు.

దేవి అదిరిపోయే ట్యూన్ కి అదే రేంజ్ లో లిరిక్స్ అందించాడు శ్రీమణి. ముఖ్యంగా లవ్ ఫీల్ క్యారీ అయ్యేలా శ్రీమణి రాసిన కొన్ని లైన్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సినిమాలో ఆశిష్- అనుపమ మధ్య ఉండే లవ్ ట్రాక్ పై అంచనాలు పెంచేలా ఉంది. లిరికల్ సాంగ్ లో వచ్చే రొమాంటిక్ విజువల్స్ కూడా ఎట్రాక్ట్ చేశాయి. సింగర్ జస్ ప్రీత్ సింగింగ్ కూడా సాంగ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు , శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హర్ష  కొనుగంటి దర్శకుడు. ‘హుషారు’ లాంటి యూత్ ఫుల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హర్ష నుండి వస్తున్న సినిమా కావడం పైగా దిల్ రాజు బేనర్ నుండి వస్తున్నా యూత్ ఫుల్ సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.


– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics