పవన్ కల్యాణ్ పై RGV మూవీ

Sunday,June 28,2020 - 01:17 by Z_CLU

కాంట్రవర్సీస్ కు పెట్టింది పేరైన రామ్ గోపాల్ వర్మ.. ఈసారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టచ్ చేశాడు. పవన్ పై ఓ సినిమా ప్రకటించిన వర్మ తన మూవీకి పవర్ స్టార్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను పోలిన ఓ నటుడ్ని కూడా పరిచయం చేశాడు వర్మ. తన ఆఫీస్ బయట పవన్ కల్యాణ్ క్యారెక్టర్ వేస్తున్న వ్యక్తి నడుస్తూ వెళ్తున్న వీడియోను షూట్ చేసి వదిలాడు.

ఈ సందర్భంగా తనదైన స్టయిల్ లో ఓ స్టేట్ మెంట్ కూడా పడేశాడు ఈ దర్శకుడు. తన హీరోను చూసి ఎవరికైనా వేరే హీరో గుర్తొస్తే అది కేవలం యాధృచ్ఛికం మాత్రమే అంటున్నాడు.

ఇప్పటికే నేక్ డ్, క్లైమాక్స్ లాంటి సినిమాల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వర్మ.. ప్రస్తుతం మర్డర్ అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు పవర్ స్టార్ అనే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చినట్టున్నాడు.