'V' లో అదిరిపోయే ట్విస్టులు

Sunday,June 28,2020 - 01:26 by Z_CLU

నాని, సుధీర్ బాబు హీరోలుగా క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘V’ సినిమాలో అదిరిపోయే ట్విస్టులు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. సినిమాలో నాని ఎందుకు కిల్లర్ గా మారతాడనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు సినిమాలో ప్రతీ అరగంటకు ఓ ట్విస్టు ఉంటుందని అవి ఎవరూ ఊహించలేని విధంగా ఉంటాయని టాక్.

ఇక వినసొంపైన పాటలు కూడా ప్రేక్షకులకు మంచి ఫీల్ కలిగిస్తుందని యూనిట్ అంటోంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్ కి వచ్చేసింది అనుకుంటున్న సమయంలో వచ్చే ట్విస్టు అందరికీ షాక్ ఇస్తుందని చెబుతోంది.. ఎప్పటికప్పుడు థ్రిల్ చేసే ట్విస్టులతో తెరకెక్కిన ‘V’ కోసం ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.

ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలు తీయడంలో మోహనకృష్ణకు ఓ స్టయిల్ ఉంది. గతంలో జెంటిల్ మేన్ అనే మూవీ చేశాడు. ఇప్పుడు దాదాపు అదే జానర్ లో V చేశాడు. కరోనా ఎఫెక్ట్ తో రిలీజ్ పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో చూడాలి.