సెంచరీ తో సెన్సేషన్...

Monday,October 10,2016 - 12:00 by Z_CLU

ఈ విజయదశమి కి బాలయ్య తను నటిస్తున్న 100 వ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ టీజర్ తోసినిమా పై అంచానాలు పెంచడానికి రెడీ అయ్యాడు. ఇటీవలే కంచె సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న క్రిష్
దర్శకత్వం లో బాలయ్య నటిస్తున్న ఈ సినిమా పై నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి.

balayya

      తాజాగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఈ పోస్టర్ లో బాలయ్య రాజసం చూసి ఫిదా అయిపోయారు నందమూరి ఫాన్స్. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తో రేపు మరో సారి హాట్ టాపిక్ అవ్వబోతున్నాడు బాలయ్య. విజయదశమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను రేపు ఉదయం 10:05 ని. లకు విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. ఈ టీజర్ ఎలా ఉండబోతుందా? అనే ఎదురుచూపులెక్కువయ్యాయి. రేపు ఈ టీజర్ తో బాలయ్య అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు మేకర్స్.