శర్వా కూడా రెడీ...

Monday,October 10,2016 - 12:13 by Z_CLU

విజయ దశమి అందరికీ సెంటిమెంట్ ఫెస్టివల్. అందుకే స్టార్ హీరో ల నుండి అప్ కమింగ్ హీరో ల వరకూ ఏదో రకంగా తమ సినిమాకు సంబంధించి ప్రచారం చేయాలనుకుంటారు. ఈ ఏడాది దసరా కి కూడా ముహుర్తాలతో తమ అభిమానులను అలరించాడనికి రెడీ అయ్యారు స్టార్ హీరోలు.నందమూరి బాలయ్య తన ప్రతిశాత్మక చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్ర టీజర్ తో విజయదశమి సెంటిమెంట్ గా రాబోతున్నాడు. అలాగే మెగా హీరో రామ్ చరణ్ కూడా తన ధృవ టీజర్ ను దసరా కానుకగా రేపే విడుదల చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

        తాజాగా నేను కూడా రెడీ అంటూ ఈ విజయదశమి కి తన తాజా చిత్రం ‘శతమానం భవతి’ టీజర్ తో సిద్దమయ్యాడు కుర్ర హీరో శర్వా నంద్. దిల్ రాజు నిర్మాణంలో వేగేశ్న సతీష్ దర్శకత్వం లో తెరక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విజయ దశమి కానుకగా ఈరోజు సాయంత్రం విడుదల చెయ్యబోతున్నారు.