రేసుకి రెడీ

Monday,November 14,2016 - 04:30 by Z_CLU

టాలీవుడ్ లో కుటుంబ కథా చిత్రాల బ్రాండ్ అంబాసిడర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘శతమానం భవతి’ సంక్రాంతి రేసులో నిలబడటానికి అంతే ప్లాన్డ్ గా, ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది.

shatamanambhavathi-pic

తాత మనవళ్ళ మధ్య ఉండే రిలేషన్ హైలెట్ గా తెరకెక్కుతున్న ‘శతమానం భవతి’ షూటింగ్ దాదాపు ఈ నెలాఖరుకు పూర్తయిపోతుంది. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు.