Dhamaka Trailer ఎక్స్ పెక్టేషన్స్ డబుల్

Thursday,December 15,2022 - 06:49 by Z_CLU

మాస్ మహారాజా రవితేజ డ్యుయల్ రోల్ లో నటిస్తున్న ‘ధమాకా’ ఈ నెల 23న క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

2 నిమిషాల నిడివితో కట్ చేసిన ట్రైలర్ లో రవితేజ డైలాగ్స్ , కామెడీ , జింతాక్ సాంగ్ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ గ్లిమ్స్  హైలైట్ గా నిలిచాయి. కోట్లలో ఒకడాడు అంటూ వాయిస్ ఓవర్ తో స్టార్టయిన ట్రైలర్ లో  హీరోయిన్ శ్రీలీల రవితేజ డ్యుయల్ రోల్ గురించి చెప్తూ స్వామీ , ఆనంద్ చక్రవర్తి పేర్లు చెప్తున్నప్పుడు వచ్చే సీన్స్ , ఆ తర్వాత తనకి ఇద్దరూ నచ్చారని చెప్పే సీన్ ఆకట్టుకుంది.

మనకి కావలసిన వాడికి చేస్తే మోసం , మనకి కావాలి అనుకునే వాళ్ళ కోసం చేస్తే న్యాయం” అంటూ  నటుడు జయరాం డైలాగ్ చెప్పాక “త్రివిక్రమ్ మీకు చుట్టమా ? సార్ ” అంటూ రవితేజ వేసే పంచ్ ట్రైలర్ లో పేలింది. మాసు మాసు మహారాజా సాంగ్ విజువల్స్ , యాక్షన్ గ్లిమ్స్ తో ట్రైలర్ పవర్  ప్యాక్డ్ గా కట్ చేసి సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్స్ పెక్టేషన్స్ ను డబుల్ చేశారు మేకర్స్.

రవితేజ నుండి ఫ్యాన్స్ , మూవీ లవర్స్ ఏం కోరుకుంటారో అవన్నీ సినిమాలో ఉండనున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు తినాథ్ రావు నక్కిన దర్శకుడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ -స్క్రీన్ ప్లే -మాటలు అందించిన ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ కంపోజర్.