2022 Year End డెబ్యూ హీరోలు
Saturday,December 17,2022 - 02:40 by Z_CLU
2022 Year End Special – Debut Heroes
ప్రతీ సంవత్సరం లానే ఈ ఏడాది కూడా కొత్త నీరులా కొందరు కొత్త హీరోలు ప్రేక్షకులకు తమ డెబ్యూ సినిమాతో పరిచయం అయ్యారు. ఇంతకీ ఈ ఇయర్ మొదటి సినిమాతో థియేటర్స్ లోకి వచ్చిన హీరోలెవరు ? జీ సినిమాలు ఇయర్ ఎండ్ స్పెషల్.

ఈ ఏడాది సంక్రాంతి ఇద్దరు యంగ్ హీరోలు తమ డెబ్యూ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో అశోక్ గల్లా ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా హీరో సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయ్యాడు అశోక్. మొదటి సినిమా అయినప్పటికీ తన నటనతో ఘట్టమనేని ఫ్యాన్స్ నే కాకుండా అందరిని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అశోక్ తన నటనతో మావయ్య తగ్గ మేనల్లుడు అనిపించాడు. మొదటి సినిమాకు కావాల్సిన మంచి కథ ఎంచుకొని అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చేసుకోవడంతో అశోక్ హీరోగా సక్సెస్ అనిపించుకున్నాడు.

సంక్రాంతి పోటీలో నిలిచి డెబ్యూ ఇచ్చిన మరో హీరో ఆశిష్. దిల్ రాజు కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ యూత్ ఆడియన్స్ని మెప్పించాడు. సినిమాలో ఓ ఆకతాయి స్టూడెంట్ గా కనిపించి హీరోగా మంచి మార్కులే అందుకున్నాడు. తన డెబ్యూ కి రొటీన్ కాలేజ్ డ్రామా ఎంచుకున్నప్పటికీ యూత్ సినిమాలకు పర్ఫెక్ట్ హీరో అనిపించుకున్నాడు. ఇదే ఏడాది హీరోగా రెండో సినిమా సెల్ఫిష్ ను సెట్స్ పై పెట్టేశాడు.

‘స్వాతి ముత్యం’ అనే సినిమాతో నిర్మాత బెల్లంకొండ తనయుడు గణేష్ బెల్లం కొండ కూడా ఈ ఇయర్ హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఫ్యామిలీ ప్లస్ కామెడీ రెండూ సమపాళల్లో ఉండే కథ ఎంచుకొని హీరోగా ఆకట్టుకున్నాడు. మొదటి సినిమా రిలీజ్ అవ్వగానే రెండో సినిమాను కూడా రిలీజ్ కి రెడీ చేసేసుకున్నాడు.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics