రవితేజకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రిష

Thursday,April 23,2020 - 04:35 by Z_CLU

హీరోయిన్లకు కూడా కొన్ని అంచనాలుంటాయి. తాము చేయబోయే పాత్రలు ఎలా ఉండాలనే అంశంపై ఓ ఐడియాతో ఉంటారు. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లయితే ఈ విషయంలో పక్కా క్లారిటీతో ఉంటారు. ప్రస్తుతం త్రిష ఈ పొజిషన్ లోనే ఉంది. అందుకే ఏకంగా చిరంజీవి ఆఫర్ ను వద్దనుకుంది. ఇప్పుడు రవితేజ సరసన నటించేందుకు రెడీ అవుతోంది.

లెక్కప్రకారం చిరంజీవి ఆచార్య సినిమాలో హీరోయిన్ గా త్రిష ఉండాలి. కానీ ఆఖరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో త్రిష స్థానంలో కాజల్ ను తీసుకున్నారు. అలా ఆచార్య నుంచి తప్పుకున్న త్రిష, ఇప్పుడు రవితేజ మూవీకి సైన్ చేసే ఆలోచనలో ఉంది.

రమేష్ వర్మ దర్శకత్వంలో త్వరలోనే ఓ రీమేక్ చేయబోతున్నాడు మాస్ రాజా. ఆ సినిమాలో హీరోయిన్ గా త్రిష అయితే బాగుంటుందని భావిస్తున్నారట. వెంటనే రమేష్ వర్మ, ఫోన్ లో త్రిషకు కథ చెప్పడం.. త్రిష ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయని అంటున్నారు. గతంలో రవితేజ-త్రిష కాంబినేషన్ లో కృష్ణ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.