మొన్న పిల్లో.. ఈసారి పేపర్

Thursday,April 23,2020 - 04:15 by Z_CLU

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా తమకు నచ్చిన విధంగా ఉంటున్నారు. కొందరు రకరకాల మేకప్స్ ట్రై చేస్తుంటే, మరికొందరు రకరకాల వంటకాలు ట్రై చేస్తున్నారు. అయితే వీళ్లందరి కంటే కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తోంది పాయల్ రాజ్ పుత్.

ఇంట్లో కొత్తకొత్త ఫ్యాషన్స్ ట్రై చేస్తోంది పాయల్. ఇందులో భాగంగా మొన్నటికిమొన్న పిల్లో డ్రెస్ తో బయటకొచ్చింది. ఆ ఫొటోస్ కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది

ఈ ఫొటోలు ఇంకా సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతుండగానే మరో ఫ్యాషన్ స్టేట్ మెంట్ ఇచ్చింది పాయల్. ఈసారి పేపర్ డ్రెస్ తో తన అభిమానుల ముందుకొచ్చింది.

ఇటు పిల్లో డ్రెస్, అటు పేపర్ డ్రెస్ తో హాట్ టాపిక్ గా మారింది ఈ హాట్ బ్యూటీ.