సాహో ఛాన్స్ వదిలేసిన రవిబాబు

Thursday,October 31,2019 - 04:08 by Z_CLU

ఒక సినిమా చేస్తుండగా యాక్టర్స్ కి మరో సినిమా రావడం రెండు సినిమాల డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఒక సినిమాను వదులుకోవడం అనేది కామనే. దర్శకుడు రవిబాబు విషయంలో కూడా అదే జరిగింది. ఒకప్పుడు అడపాదడపా పాత్రలు చేస్తూనే మరో వైపు తన ఆలోచనలతో సినిమాలు డైరెక్ట్ చేస్తుండేవారు రవిబాబు. అలా దర్శకుడిగా బిజీగా ఉన్న టైమ్ లో వచ్చిన సాహో ఆఫర్ ను తిరస్కరించాననే విషయాన్ని బయటపెట్టారు.

‘అదుగో’ సినిమా కోసం ఏకంగా రెండేళ్ళపైనే బిజీ అయ్యాడు రవిబాబు. ఆ సమయంలో రవిబాబుకి నటుడిగా చాలా అవకాశాలొచ్చాయట. అందులో ప్రభాస్ ‘సాహో’ కూడా ఒకటి. కానీ దర్శకుడిగా బిజీగా ఉండటంతో ‘సాహో’ను తిరస్కరించాడట. ఈ విషయాన్నీ స్వయంగా చెప్పుకున్నాడు రవిబాబు.

ఇక ఆవిరి సినిమాలో తండ్రి పాత్ర కోసం చాలా మందిని అనుకున్నప్పటికీ ఇక ఛాయిస్ లేక తనే ఆ పాత్రను చేసినట్టు తెలిపాడు. ఇక ఈ సినిమాతో మళ్ళీ నటుడిగా బిజీ అవుతానని అన్నాడు.

త్వరలోనే ఓ ఓల్డ్ ఏజ్ ఎమోషనల్ డ్రామాతో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఆ సినిమా ఎవరితో చేయాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదని ఒకవేళ అక్కినేని నాగేశ్వరరావు గారు ఉండుంటే ఆయనని ఎలాగోలా బ్రతిమాలి నటింపజేసేవాడినని చెప్పుకున్నాడు.