Raviteja: నో గ్యాప్ అంటున్న సీనియర్ హీరో

Tuesday,November 01,2022 - 02:16 by Z_CLU

Ravi Teja buzy with five projects

మాస్ మహారాజా రవితేజ (Raviteja) నో గ్యాప్ అంటూ జెట్ స్పీడులో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు సినిమాలున్నాయి. ‘ధమాకా’ , ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి తో చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ఉంది. ప్రస్తుతం ధమాకా షూటింగ్ తో పాటు చిరంజీవి సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశాడు రవితేజ. ‘రావణాసుర’, టైగర్ నాగేశ్వరరావు సెట్స్ పై ఉండగానే ‘ఈగల్’ అనే మరో స్టైలిష్ యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఆ సినిమాను కూడా  సెట్స్ పైకి తీసుకొచ్చేశాడు.

ప్రస్తుతం రవితేజ పోలాండ్ లో ఉన్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో నటిస్తున్న ‘ఈగల్’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ధమాకా (Dhamaka) , వాల్తేరు వీరయ్య షూటింగ్ పూర్తవ్వగానే ఈ సినిమాను స్టార్ట్ చేసేసి నో గ్యాప్ నో బ్రేక్ అంటూ దూసుకెళ్తున్నాడు. నిజానికి క్రాక్ తర్వాత స్పీడ్ పెంచేసి సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఖిలాడి అంటూ వెంటనే థియేటర్స్ లోకి వచ్చాడు. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అందుకే నెక్స్ లైనప్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడు.

డిసెంబర్ లో ‘ధమాకా’ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న రవితేజ వెంటనే జనవరిలో మళ్ళీ ‘వాల్తేరు వీరయ్య’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంటే రవితేజ నుండి నెలకో సినిమా రాబోతుందన్నమాట. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సుదీర్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న రావణాసుర’ ఆ వెంటనే కార్తిక్ తో చేస్తున్న స్టైలిష్ యాక్షన్ సినిమాతో రావాలని చూస్తున్నాడు. వచ్చే ఏడాది చివర్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. అంటే వచ్చే ఏడాది రవితేజ నుండి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వాటిలో మూడు సినిమాలు మాత్రం పక్కా.

 

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics