నెక్ట్స్ సినిమాకు అలా సెట్ చేశాడు

Saturday,February 23,2019 - 04:14 by Z_CLU

కార్తి ఏ సినిమా చేసినా తెలుగు-తమిళ భాషల్ని దృష్టిలో పెట్టుకొని సెలక్ట్ చేసుకుంటాడు. కథల్ని పక్కనపెడితే హీరోయిన్స్ విషయంలో మాత్రం రెండు భాషలకు కనెక్ట్ అయ్యే హీరోయిన్ కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంటాడు. తాజాగా వచ్చిన దేవ్ సినిమాకు కూడా తెలుగు-తమిళ ఆడియన్స్ కు బాగా పరిచయమైన రకుల్ ప్రీత్ ను తీసుకున్నాడు. కానీ తన నెక్ట్స్ మూవీకి మాత్రం ఈ ఫార్ములాను పక్కనపెట్టాడు కార్తి.

రెమో సినిమాను తెరకెక్కించిన భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు కార్తి. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను సెలక్ట్ చేశాడు. రష్మికకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది కానీ తమిళనాట ఆమె పూర్తిగా కొత్త. పైగా ఇదే ఆమెకు తొలి తమిళ సినిమా.

కథ ప్రకారం రష్మిక అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా ఆమెను ఎంపిక చేశాడు కార్తి. నిజానికి కార్తి తలుచుకుంటే తమన్న నుంచి రాశిఖన్నా వరకు ఎవరినైనా హీరోయిన్ గా తీసుకోవచ్చు. కానీ కథకు ఇంపార్టెన్స్ ఇచ్చి రష్మికను సెలక్ట్ చేశాడట.