న్యూ ఇయర్ కు రష్మిక ఎక్కడ?

Monday,December 23,2019 - 11:34 by Z_CLU

న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు, స్టార్స్ అంతా డెస్టినేషన్స్ చూసుకుంటారు. టాలీవుడ్ స్టార్స్ లో ఎక్కువమంది విదేశాలకు చెక్కేస్తే, మిగతావాళ్లంతా గోవా చేరుకుంటారు. ఈ న్యూ ఇయర్ ను రోమ్ లో సెలబ్రేట్ చేసుకోబోతోంది రష్మిక. భీష్మ షూటింగ్ కోసం రోమ్ వెళ్లిన ఈ బ్యూటీ, కొత్త ఏడాదికి అక్కడే స్వాగతం చెబుతుంది.

నిజానికి భీష్మ రోమ్ షెడ్యూల్ మరో 4 రోజుల్లో ముగుస్తుంది. యూనిట్ అంతా వెనక్కి వచ్చేస్తుంది. కానీ రష్మిక మాత్రం అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ఆమె సడెన్ గా తీసుకున్నది కాదు. దీనికోసం ఆమె పక్కాగా ప్లాన్ చేసుకుంది.

మహేష్ తో చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ ను పూర్తిచేసింది రష్మిక. అందరికంటే ముందే డబ్బింగ్ కూడా పూర్తిచేసింది. రోమ్ లో సెలబ్రేషన్స్ కోసమే రష్మిక ఇలా అంతా ముందుగా ఫినిష్ చేసింది. తిరిగి జనవరి 5న కలుద్దామంటూ ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఈ ఇయర్ ఓ రేంజ్ లో మెరిసిన రష్మిక, వచ్చే ఏడాదికి కూడా ఇంట్రెస్టింగ్ మూవీస్ లైన్లో పెట్టింది. బన్నీ-సుకుమార్ సినిమాలో ఈమెను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది.