ఆది సాయికుమార్ కొత్త సినిమా డీటెయిల్స్

Monday,December 23,2019 - 12:15 by Z_CLU

హీరో ఆది సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా అతడి నెక్ట్స్ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూరి జగన్నాధ్ దగ్గర పని చేసిన జి.బి.కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. కథ కూడా అతడిదే.

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి ప్రారంభం అవుతుంది. ఆది సాయికుమార్ చేసిన గత సినిమాల కంటే ఇది భిన్నంగా ఉంటుందంటున్నాడు నిర్మాత. వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ జనవరిలో స్టార్ట్ అవుతుంది. సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.