రానా 'హిరణ్య కశిప' మూవీ అప్ డేట్స్

Tuesday,February 18,2020 - 07:29 by Z_CLU

ఏప్రిల్ లో ‘అరణ్య’ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్న దగ్గుబాటి రానా ప్రస్తుతం వేణు ఉడుగుల డైరెక్షన్ లో ‘విరాటపర్వం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే…ఈ సినిమాతో పాటే  బిగ్ ప్రాజెక్ట్ ‘హిరణ్య కశిప’ ను కూడా సెట్స్ పై పెట్టబోతున్నాడు. కొన్నేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి రాబోతుంది.

దాదాపు మూడేళ్ళ పాటు ఈ సినిమా కోసం వర్క్ చేసింది గుణ టీం.  ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి రావడంతో సమ్మర్ నుండి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. వైజాగ్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా కోసం ఓ భారీ సెట్  వేస్తున్నారు. దాదాపు ఈ స్టూడియోలోనే టాకీ పార్ట్ తీసేలా ప్లానింగ్ జరుగుతుంది. ఇక రామోజీ ఫిలిం సిటీలో కూడా ఓ భారీ సెట్ వేసి కొన్ని సన్నివేశాలతో పాటు సాంగ్స్ తీస్తారని సమాచారం. సురేష్ ప్రొడక్షన్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా లాంచ్ , షూటింగ్ డీటెయిల్స్ త్వరలోనే తెలియనున్నాయి.