సిద్దార్థ్ Vs ఆదిత్య.. రెడ్ టీజర్ రివ్యూ

Friday,February 28,2020 - 05:49 by Z_CLU

రెడ్ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ఆ విషయాన్ని లాంఛింగ్ రోజు దాచలేదు. ఈరోజు రిలీజైన టీజర్ లో కూడా దాచే ప్రయత్నం చేయలేదు. సిద్దార్థ్, ఆదిత్య.. ఇద్దరూ వేరు వేరు. చూడ్డానికి ఒకేలా కనిపిస్తారు కానీ మెంటాలిటీస్ లో చాలా తేడా. వీళ్లిద్దరి మధ్య జరిగిన క్రైమ్ థ్రిల్లర్ రెడ్ అనే విషయాన్ని టీజర్ లో క్లియర్ గా చెప్పేశారు.

క్రైమ్ హిస్ట‌రీలో ఇలాంటి కేసు చూడ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ అంటూ మొద‌లుపెట్ట‌డం సినిమాపై ఆస‌క్తిని పెంచింది. సిద్ధార్థ్.. ఆదిత్య ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ లైఫ్స్.. డిఫ‌రెంట్ వ‌ర‌ల్డ్స్ అంటూ లేడీ కాప్ నివేద ఇన్వెస్టిగేష‌న్ లో చెప్పేసింది కాబ‌ట్టి .. రామ్ ఒక్క‌డు కాదు ఇద్ద‌రు అని భావించేందుకే స్కోప్‌ ఉంది.

అయితే ఆ రెండు పాత్ర‌ల్లో ఏది నిజం? ఏది అబ‌ద్ధం? ఇంకేదో స‌స్పెన్స్ ఎలిమెంట్ ఉంద‌ని ట్రైల‌ర్ ముగింపులో `నేనే` అనే డైలాగ్ తో క్లూ ఇచ్చేశారు? అస‌లింత‌కీ ఆ క్లూ వెన‌క ఫుల్ క్రైమ్ స్టోరీ ఏమిటో తెలియాలంటే థియేట‌ర్ల‌లో సినిమా చూడాల్సిందే.

రెండు డిఫ‌రెంట్ గెటప్పుల‌తో టీజర్ లో ఎంతో ఎనర్జిటిక్ గా క‌నిపించాడు రామ్. క్రిమిన‌ల్ గెట‌ప్ కి.. సాఫ్ట్ వేర్ వేషానికి మ‌ధ్య డిఫ‌రెన్స్ ఆక‌ట్టుకుంది. నివేత పెతురాజ్, మాళ‌విక శ‌ర్మ, నాజ‌ర్, అమృత అయ్య‌ర్ పాత్రల్లో ఇంటెన్సిటీ ఆక‌ట్టుకుంది. టీజర్ లో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలోకి వస్తోంది.