కార్తికేయ-2కు ముహూర్తం ఫిక్స్
Friday,February 28,2020 - 03:37 by Z_CLU
నిఖిల్ కెరీర్ లో కార్తికేయ సినిమాది ప్రత్యేక స్థానం. సోషల్ మీడియాలో కార్తికేయ సీక్వెల్ ఎప్పుడు అని ఇటు నిఖిల్ ని, అటు దర్శకుడు చందు మెుండేటి ని అడగని నెటిజన్స్ లేరనే చెప్పాలి. అంతలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
యానిమల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్ ని ఆ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం చేశారు. ఇన్నాళ్ళకి మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో కార్తికేయ2 రాబోతోంది. మార్చి2 న తిరుపతిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమా రాబోతోంది. “అర్జున్ సురవరం” లాంటి హిట్ తరువాత ఏ చిత్రం చేయకుండా కొంత గ్యాప్ తీసుకుని ప్రేక్షకులకి , తన అభిమానులకి కిక్ ఇచ్చే చిత్రం చేయాలని గట్టి సంకల్పంతో నిఖిల్ కార్తికేయ2 స్టార్ట్ చేశాడు.
ఈ ఏడాది చివర్లో కార్తికేయ-2ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.