ఇకపై ఏం చేసినా కలిసి చేయాల్సిందే

Tuesday,March 10,2020 - 01:16 by Z_CLU

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇది. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్, ఎన్టీఆర్ పై విడివిడిగా తీయాల్సిన సన్నివేశాలన్నీ పూర్తయ్యాయి. ఇకపై ఏ సీన్ తీయాలన్నా చరణ్-తారక్ ఉండాల్సిందే. అన్నీ వాళ్ల కాంబినేషన్ సీన్సే. పైగా యాక్షన్ సీన్స్ కూడా కావడంతో హీరోలిద్దరూ తెగ కష్టపడుతున్నారు.

ఈరోజు హోలీ కావడంతో యూనిట్ కు హాలిడే ఇచ్చాడు జక్కన్న. రేపట్నుంచి షూటింగ్ మళ్లీ ప్రారంభం అవుతుంది. ఈ సినిమా కోసం షెడ్యూల్స్ లెక్కలు వేయడం లేదు రాజమౌళి. స్క్రీన్ ప్లే ప్రకారం అనుకున్న సీన్స్ అనుకున్నట్టు వచ్చినంతవరకు షూటింగ్ చేయడమే.

సినిమా రిలీజ్ ను కూడా వచ్చే ఏడాదికి వాయిదా వేయడంతో రాజమౌళిపై ప్రెషర్ తగ్గింది. ఇప్పుడు మరింత జాగ్రత్తగా సినిమాను తీర్చిదిద్దే పనిలో పడ్డాడు. అయితే మే నెలాఖరు వరకే రామ్ చరణ్, ఎన్టీఆర్ కాల్షీట్లు ఉన్నాయి. ఈ లోగానే రాజమౌళి తన పని పూర్తిచేయాల్సి ఉంటుంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న థియేటర్లలోకి రానుంది ఆర్ఆర్ఆర్.