SS Rajamouli జక్కన్న బర్త్ డే స్పెషల్

Monday,October 10,2022 - 04:36 by Z_CLU

‘బాహుబాలి’ వరకూ ఇండియన్ సినిమా టెక్స్ట్ బుక్ లో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి , స్థానం వేరు. కానీ ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి ఫ్రాంచైజీ తో ఇండియన్ సినిమా బెరీర్ దాటేసి తెలుగు సినిమా స్థాయిని అమాంతంగా ఎవరెస్ట్ ఎక్కించాడో అప్పటి నుండి లెక్క మారి తెలుగు సినిమాకి ఓ గొప్ప గౌరవం దక్కింది. సౌత్ సినిమాలు ఇవ్వాళ పాన్ ఇండియా సినిమా అంటూ ఇండియన్ సినిమా లెవెల్ కి వెళ్ళడానికి ఓ ప్రయత్నం చేస్తున్నాయంటే దానికి కారణం రాజమౌళి. తన విజువల్స్ తో వండర్స్ క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు సినిమా అభిమానుల్ని మెప్పిస్తూ రికార్డులు తిరగరాస్తూ ముందుకు సాగుతున్న దర్శకుడు రాజమౌళి జన్మదిన సందర్భంగా జీ సినిమాలు స్పెషల్ స్టోరీ.

రాజమౌళి మొదటి సినిమా ‘స్టూడెంట్ నెంబర్ 1’ నుండే ప్రేక్షకుల పల్స్ పట్టుకొని హిట్లు కొట్టడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సింహాద్రితో రికార్డులు తిరగరాశాడు. రెండో సినిమాకే దర్శకుడిగా తన సత్తా ఏంటో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రూపంలో చూపించి ఔరా అనిపించుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ చాలా ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగమలై అంటూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే ప్రేక్షకులకు రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అదీ రాజమౌళి క్రియేట్ చేసిన ఇంపాక్ట్.

‘సై’ తో స్పోర్ట్స్ డ్రామా టచ్ చేసి ఆడియన్స్ కి ఓ సరికొత్త ఎక్స్ పీరియన్స్   అందించాడు రాజమౌళి. స్పోర్ట్స్ ఎలిమెంట్ తీసుకొని దాన్ని రాజమౌళి యూత్ ఫుల్
కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దిన విధానం చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఛత్రపతితో ప్రభాస్ ని మాస్ ఆడియన్స్ కు విపరీతంగా దగ్గర చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి ‘విక్రమార్కుడు’తో రవితేజను సరికొత్తగా ప్రెజెంట్ చేసి విక్రం రాథోడ్ అనే కేరెక్టర్ ని ఎప్పటికీ మర్చిపోలేని విధంగా తీర్చిదిడ్డాడు.

‘యమ దొంగ’ తో ఫాంటసీ మూవీ , ‘మగధీర’ తో విజువల్ వండర్ మూవీ , సునీల్ తో ‘మర్యాద రామన్న; అంటూ కామెడీ మూవీ , నాని ను హీరోగా పెట్టి ఈగ అనే డిఫరెంట్ మూవీ ఇలా రాజమౌళి తీసిన ప్రతీ ఒక్కటి దేనికదే స్పెషల్. ప్రతీ సినిమాకు ఒక్కో జానర్ టచ్ చేస్తూ ఏ సినిమా తీసినా అందులో తన తరహా కమర్షియల్ టచ్ ఉండేలా చూసుకుంటూ దర్శకుడిగా ఒక్కో మెట్టు ఎక్కిన జక్కన్న అలియాస్ రాజమౌళి ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తో ఏకంగా కుంభస్థలం బద్దలు కొట్టినట్టుగా రికార్డులు తిరగరాశాడు. ఎవరూ టచ్ చేయలేని ఓ అరుదైన రికార్డు నెలకొలిపి బాలీవుడ్ సైతం తనవైపు చూసేలా చేసుకున్నాడు. తెలుగు స్థాయిని అమాంతంగా ఉన్నత శికరాలకు ఎగేరేలా చేసిన రాజమౌళి ఇండియన్ సినిమాకు ఓ ఐకాన్ లా నిలిచిపోయాడు. RRR తో ఎన్టీఆర్ -రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి ఎవరూ చేయలేని ఓ గొప్ప సాహసం చేసి బాక్సాఫీస్ రికార్డులు మళ్ళీ తిరగరాసి తనకి తానే సాటి అని నిరూపించుకున్నాడు. త్వరలోనే మహేష్ బాబు తో మరో సరికొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పి టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమాశిల్పి జక్కన్న కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది జీ సినిమాలు.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics