రామ్ కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్

Tuesday,December 25,2018 - 11:49 by Z_CLU

రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘హలో గురూ ప్రేమేకోసమే’ తో  మెస్మరైజ్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్, ఈ సారి మాస్ అవతార్ లో కనిపించాలని ఫిక్సయ్యాడు. మాసివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చే నెల నుండి సెట్స్ పైకి రానున్నాడు ఈ హీరో. నిన్నా మొన్నటి వరకు జస్ట్ స్పెక్యులేషన్ గా ఉన్న ఈ న్యూస్ ని, క్రిస్మస్ సందర్భంగా ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

పూరి, రామ్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లో న్యాచురల్ గానే ఈ సినిమా చుట్టూ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు సాఫ్ట్ యూత్ ఫుల్ క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేసిన రామ్, పూరి మేకింగ్ లో మాస్ లుక్ లో ఆదరగొట్టడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రామ సరసన నటించనున్న హీరోయిన్ తో పాటు  తక్కిన  టెక్నీషియన్స్ డీటేల్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు మేకర్స్.