'మజ్ను' కోసం అఖిల్ పడ్డ 3 నెలల కష్టం

Tuesday,December 25,2018 - 11:15 by Z_CLU

ఈ రోజు ఈవినింగ్ 6 గంటలకు క్రిస్మస్ కానుకగా అఖిల్ ‘మజ్ను’ నుండి టైటిల్ సాంగ్ రిలీజవుతుంది. అయితే ఈ అనౌన్స్ మెంట్ తో పాటు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. దానికి రీజన్ సిక్స్ ప్యాక్ లో అఖిల్ అదిరిపోయే లుక్స్.

ఈ సినిమా కోసమే స్పెషల్ గా సిక్స్ ప్యాక్స్ ట్రై చేశాడు అఖిల్. ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, 3 నెలలుగా ఈ సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డాను అని చెప్పుకున్నాడు. ఈ రోజు రిలీజవుతున్న టైటిల్ సాంగ్ లోదే ఈ పోస్టర్ స్టిల్ అని తెలుస్తుంది.

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మోస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది మజ్ను. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్. B.V.S.N. ప్రసాద్ ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. జనవరి 25 న రిలీజవుతుంది Mr మజ్ను. తమన్  ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.