GameChanger రామ్ చరణ్ ఫస్ట్ లుక్

Monday,March 27,2023 - 03:36 by Z_CLU

Ram Charan’s first look from Game Changer released

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుండి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం టైటిల్ ఎనౌన్స్ చేసిన మేకర్స్ ఫ్యాన్స్ కి డబుల్ గిఫ్ట్ గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. బైక్ పై చరణ్ స్టైలిష్ లుక్ లో వెనుతిరిగి చూస్తున్న స్టిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు.

 

 

శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో ఓ క్రేజీ సాంగ్ ను ఘాట్ చేశారు. ప్రభుదేవా మాస్టర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ సినిమాకే హైలైట్ అని తెలుస్తుంది. హైదరాబాద్ , రాజమండ్రి , వైజాగ్ , అమృత్సర్ పలు ప్రదేశాలలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి సగంపైనే ఘాట్ కంప్లీట్ అయింది.

ప్రస్తుతం షూటింగ్ స్టేజీలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. రామ్ చరణ్ సరసన కీయరా అద్వానీ , అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని , శ్రీకాంత్ , ఎస్ జే సూర్య, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజర్.