రామ్ చరణ్ ముఖ్య అతిథిగా అంతరిక్షం ప్రీ రిలీజ్ వేడుక
Monday,December 17,2018 - 11:22 by Z_CLU
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం అంతరిక్షం 9000 kmph. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది. రేపు (డిసెంబర్ 18న) ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరగనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీనికి ముఖ్య అతిథిగా వస్తున్నాడు.
అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షం 9000 kmph సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తాజాగా విడుదలైన ఆడియో.. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నాడు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
నటీనటులు:
వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల
సాంకేతిక విభాగం:
దర్శకుడు: సంకల్ప్ రెడ్డి
నిర్మాతలు: రాధాకృష్ణ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగర్లమూడి
నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ విఎస్ (బాబా)
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ సబ్బని, మోనిక నిగొత్రే సబ్బని
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
స్టంట్స్: టడోర్ లజరోవ్
సిజి: రాజీవ్ రాజశేఖరన్
పిఆర్ఓ: వంశీ శేఖర్