చెన్నైలో ఆల్ టైం నంబర్ వన్ 2.O

Monday,December 17,2018 - 11:35 by Z_CLU

ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన 2.O సినిమా చెన్నైలో మరో చెక్కుచెదరని రికార్డు సృష్టించింది. చెన్నై బాక్సాఫీస్ లో ఆల్ టైం నంబర్ వన్ మూవీగా నిలిచింది 2.O సినిమా. నిన్నటి వసూళ్లతో కలుపుకొని చెన్నై బాక్సాఫీస్ లో 22 కోట్ల 37 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఈ దెబ్బతో ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ కొట్టుకుపోయాయి.

వరుసగా మూడో వారం కూడా ఈ సినిమా హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ సినిమాకు కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. అటు ఓవర్సీస్ లో తాజాగా 5 మిలియన్ క్లబ్ లోకి ఎంటరైంది 2.O సినిమా.

ఓవర్సీస్ తో పాటు యూఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్, మలేషియా, థాయ్ లాండ్ దేశాల్లో 2.O సినిమాకు కళ్లుచెదిరే కలెక్షన్లు వస్తున్నాయి. వరల్డ్ వైడ్ ఇప్పటికే 750 కోట్ల రూపాయలు ఆర్జించిన ఈ సినిమా, మరికొన్ని రోజుల్లో 800 కోట్ల క్లబ్ లోకి చేరబోతోంది.