స్పైడర్ లో రకుల్ రోల్ రివీల్ అయింది

Thursday,April 13,2017 - 02:06 by Z_CLU

సోషల్ మీడియాలో స్పైడర్ మ్యాగ్జిమం స్పేస్ ఆక్యుపై చేసేసింది. 2 రోజులు ముందుగానే అనౌన్స్ చేసినట్టు నిన్న స్పైడర్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఫీస్ట్ లా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగుతో పాటు అప్పుడే తమిళం లోను ప్రమోషన్స్ బిగిన్ చేసేసింది సినిమా యూనిట్. దానికి తోడు రీసెంట్ గా తమిళ పాప్యులర్ మ్యాగజైన్ లో మహేష్ బాబు ఇంటర్వ్యూతో పాటు కొన్ని స్టిల్స్ కూడా రిలీజ్ కావడం తో ఆ హీట్ తమిళ నాటే కాదు టాలీవుడ్ ని షేక్ చేస్తుంది.

మహేష్ బాబు సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అమ్మడూ ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించనుందో ఇప్పటి వరకు పెద్ద క్వశ్చన్ మార్క్ లా ఉండేది. ఇప్పుడా సస్పెన్స్ కి కూడా బ్రేక్ పడిపోయింది. ఈ సినిమాలో రకుల్ మెడిసిన్ స్టూడెంట్ గా నటిస్తుంది.

 

అల్టిమేట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాగ్జిమం ఏప్రిల్ లో ప్యాకప్ చెప్పే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాతో మహేష్ బాబు తమిళనాట గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కోలీవుడ్ లో వస్తున్న రియాక్షన్స్ చూస్తుంటే, ఇప్పటికే సూపర్ స్టార్ హవా బిగిన్ అయిందనిపిస్తుంది.