నాగచైతన్య సినిమాలో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్

Thursday,April 13,2017 - 03:02 by Z_CLU

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకి ఇలా ప్యాకప్ చెప్పాడో లేడో ఏ మాత్రం గ్యాప్ లేకుండా తన నెక్స్ట్ సినిమా సెట్స్ పైకి వచ్చేశాడు నాగచైతన్య. కృష్ణ మరిముత్తు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ నిన్న సక్సెస్ ఫుల్ గా సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.

ఇప్పటికే మ్యాగ్జిమం అటెన్షన్ ని బ్యాగ్ లో వేసుకున్న ఈ సినిమా యూనిట్, వర్కింగ్ స్టిల్స్ ని రిలీజ్ చేసి మరింత క్యూరాసిటీని జెనెరేట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ నాగార్జునతో జోడీ కట్టిన లావణ్య ఈ ఇయర్ నాగ చైతన్యతో జత కట్టడం ఫ్యాన్స్ కి పెద్ద ఇంటరెస్టింగ్ డిస్కషన్ పాయింట్ లా మారిపోయింది.

సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి  వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ ని కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.