రకుల్ ఇటు.. లావణ్య అటు

Wednesday,July 22,2020 - 01:00 by Z_CLU

లాక్ డౌన్ వల్ల మొన్నటివరకు హీరోయిన్లంతా తమ ఇళ్లలోనే కూర్చున్నారు. ఇప్పుడిప్పుడే అన్-లాక్ ప్రాసెస్ మొదలవ్వడంతో హీరోయిన్లు కూడా ప్రయాణాలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు తల్లిదండ్రులకు దూరంగా ఉన్న హీరోయిన్ల సొంతూళ్లకు వెళ్తే.. ఇంటిపట్టునే ఉన్న హీరోయిన్లు కొందరు వర్క్ కోసం హైదరాబాద్ వస్తున్నారు.

హీరోయిన్ రకుల్ హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. లాక్ డౌన్ టైమ్ లో ముంబయిలో లాక్ అయిన ఈ బ్యూటీ, నెల కిందట తన సొంతూరు గుర్గావ్ వెళ్లింది. ఇప్పుడు హైదరాబాద్ చేరుకుంది. తను కమిట్ అయిన ఏ సినిమా స్టార్ట్ అయినా ఆమె సెట్స్ పైకి రావడానికి రెడీగా ఉంది.

అటు మరో హీరోయిన్ రకుల్ మాత్రం హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వెళ్లింది. లాక్ డౌన్ టైమ్ లో హైదరాబాద్ లో ఉండిపోయిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు 3 నెలలు తల్లిదండ్రులకు దూరంగా గడిపింది. ఇప్పుడు అమ్మానాన్నను చూసేందుకు డెహ్రాడూన్ వెళ్లింది.