కరోనా ఎఫెక్ట్ ... మెగా ముందడుగు

Wednesday,July 22,2020 - 02:08 by Z_CLU

కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినా స్టార్ హీరోల సినిమాలు షూటింగ్స్ మొదలు కాని పరిస్థితి. తాజాగా చిన్న సినిమాలు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. కానీ బడా సినిమాల షూటింగ్స్ మాత్రం ఇప్పుడే ప్రారంభమయ్యే సూచనలు కనబడటం లేదు. ముందుగా ఎవరైనా స్టార్ హీరో బయటికొచ్చి జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ చేస్తే మిగతా వారు మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు.

అందుకే వారిలో భయం పోగొట్టడానికి మెగాస్టార్ ముందడుగు వేయబోతున్నారని సమాచారం. అవును.. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ వాయిదా వేసుకున్న చిరు అండ్ టీం ఇప్పుడు మళ్ళీ ‘ఆచార్య’ షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు.

ఆగస్ట్ మూడో వారం నుండి రామోజీ ఫిలిం సిటీలో తక్కువ మంది సాంకేతిక నిపుణులతో ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ షూటింగ్ చేయబోతున్నారు. మెగా ముందడుగుతో ఆటోమేటిక్ గా మిగతా స్టార్ హీరోలు ఆ బాటలో నడవడానికి రెడీ అవుతారు.

అందుకే బడా నిర్మాతల శ్రేయస్సు కోరి చిరు తన సినిమా షూటింగ్ తో మళ్ళీ ఇండస్ట్రీలో పనులు మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ముందుగా యూనిట్ ఓ 10 రోజుల షెడ్యుల్ చేయాలని డిసైడ్ అయ్యారని ఇన్సైడ్ టాక్. మరి చిరు తర్వాత షూటింగ్ లో కాలు పెట్టే మరో స్టార్ట్ హీరో ఎవరవుతారో చూడాలి.