నాని సినిమా దిల్ రాజు చేతికి

Wednesday,July 15,2020 - 02:32 by Z_CLU

ప్రస్తుతం కొందరు హీరోలు నిర్మాతలుగా మారి కాన్సెప్ట్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులో నేచురల్ స్టార్ నాని ఒకడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘అ!’ సినిమాతో వాల్ పోస్టర్ సినిమా అనే సంస్థను స్థాపించి స్నేహితురాలు ప్రశాంతి తో కలిసి నిర్మాతగా మారాడు నాని. తర్వాత విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘హిట్’ సినిమాను నిర్మించాడు.

నాని నిర్మించిన ‘హిట్’ సినిమా తెలుగులో మంచి విజయం సాధించడంతో ఇప్పుడు ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇటివలే హిట్ హిందీ రీమేక్ రైట్స్ తీసుకున్న దిల్ రాజు, కుల్దీప్ రాథోర్ తో కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మించనున్నాడు.

రాజ్ కుమార్ రావు హీరోగా తెరకెక్కనున్న ఈ రీమేక్ తో శైలేష్ కొలను దర్శకుడిగా బాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు. బాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్, నేటివిటీకి తగ్గట్టు స్క్రీన్ ప్లేలో చిన్నచిన్న మార్పులు చేస్తున్న దర్శకుడు.. వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.