THE CHASE - పూర్తిగా లాక్ డౌన్ లో తీసిన సినిమా

Thursday,September 03,2020 - 01:43 by Z_CLU

సందీప్ కిషన్ హీరోగా ‘‘నిను వీడను నీడను నేనే’’ లాంటి థ్రిల్లర్ మూవీ తీసి ఆకట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ ప్రస్తుతం రెజీనా తో ‘‘నేనే నా’’ అనే మరో సినిమా తెరకెక్కిస్తున్నారు.. ఈ ప్రాజెక్ట్ కాకుండా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు డైరెక్టర్ కార్తీక్ రాజు.. తమిళ్ లో హిట్టైన ‘‘ప్యార్ ప్రేమ కాదల్’’మూవీ ఫేం ‘‘రైజా విల్సన్’’ (Raiza Wilson) మెయిన్ లీడ్ గా ‘‘ది చేజ్’’ అనే తెలుగు,తమిళ బైలింగ్వల్ మూవీని రూపొందిస్తున్నాడు.

ఈ సందర్భంగా డైరెక్టర్ Karthik Raju మాట్లాడుతూ:
మా టీమ్ అంతా కలిసి ఈ లాక్ డౌన్ లో ఏదైనా క్రియేటివ్ గా ప్లాన్ చేయాలనుకొని ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాం. ప్రభుత్వ ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూనే తక్కువ మందితో షూట్ చేసాం.ఈ సినిమాకోసం ఓ పెద్ద ఫారెస్ట్ లోని హిల్ స్టేషన్ లో షూట్ చేశాం.సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

THE CHASE సినిమా ఓ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ. ఓ తల్లీ,కూతురు ఇంకో టీనేజర్ మధ్య సాగే కథ. చాలా ట్విస్టులతో ఆద్యంతం ఉత్కంఠ గా సాగుతుంది. రంగస్థలం ఫేం అనసూయ (Anasuya) ఈ మూవీలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోషించింది.

నటీనటులు: రైజా విల్సన్, అనసూయ, మోనిక (ఖైదీ ఫేమ్), సత్యం రాజేష్, హరీష్ ఉత్తమన్,
మధునందన్.

టెక్నీషియన్స్:
సినిమాటోగ్రాఫర్ : వేల్ రాజ్
యాక్షన్ కొరియోగ్రాఫర్ : దిలీప్ సుబ్బరాయన్
మ్యూజిక్ డైరెక్టర్ : శ్యామ్ సి.ఎస్
ఎడిటర్ : సాబు జోసెఫ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స,ప్రభా చింతలపాటి
నిర్మాత: రాజశేఖర్ వర్మ
రచన,దర్శకత్వం: కార్తీక్ రాజు.