"కాంచ‌న‌-3".. ఈసారి మరింత కొత్తగా!

Sunday,March 17,2019 - 10:39 by Z_CLU

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, తన స్వీయ ద‌ర్శ‌కత్వం లో ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ కాంచ‌న‌-3. రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణం లో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయనున్నారు.

రాఘ‌వ లారెన్స్ అందించిన హార్ర‌ర్ చిత్రాల‌న్నీ సౌత్ ఇండియా లో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన‌వే. అన్నిటిని మించి ఈ కాంచ‌న‌-3 మాత్రం లారెన్స్ కి స్పెష‌ల్ చిత్రంగా నిలవనుంది. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మ‌ధు విడుదల చేయనున్నారు.

న‌టీన‌టులు.. రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, స‌త్య‌రాజ్‌, కిషోర్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫి– వెట్రి, స‌ర్వేష్ మురారి,
మ్యూజిక్ – తమన్
క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌కత్వం – రాఘ‌వ లారెన్స్‌