రొమాన్స్+యాక్షన్.. డియర్ కామ్రేడ్ టీజర్

Sunday,March 17,2019 - 01:10 by Z_CLU

విజయ్ దేవరకొండ నుంచి మరో మూవీ రెడీ అయింది. మరీ ముఖ్యంగా గీతగోవిందం జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటిస్తున్న సినిమా ఇది. అదే డియర్ కామ్రేడ్. టైటిల్, ఫస్ట్ లుక్ తోనే అందర్నీ ఎట్రాక్ట్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు వాటికి ఏమాత్రం తగ్గకుండా టీజర్ కూడా రిలీజైంది.

డియర్ కామ్రేడ్ అనే టైటిల్ కు తగ్గట్టు.. సినిమా థీమ్ ను ఎలివేట్ చేస్తూ.. టీజర్ కట్ చేశారు. కేవలం ఓ యాక్షన్ సీక్వెన్స్, మరో రొమాంటిక్ సీన్ ను మాత్రమే టీజర్ చూపించి అంచనాల్ని పెంచేశారు. స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండను, అతడి లవర్ గా రష్మికను చూపించారు.

భరత్ కమ్మ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.