Radheshyam Song - బ్యూటిఫుల్ విజువల్స్

Friday,February 25,2022 - 04:51 by Z_CLU

Radheshyam Ee Raathale Video Song is an instant Hit

రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా నుంచి ఈ రాతలే వీడియో సాంగ్ విడుదలైంది. ఈ మధ్యే విడుదలైన ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ పాట వైరల్ గా మారింది. ఈ కలర్ ఫుల్ వీడియోకు అనూహ్య స్పందన వస్తుంది.

ఈ పాట వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ లిరికల్ సాంగ్ చూస్తే.. పాటలో 5 అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం పంచ భూతాలుగా పిలుచుకునే నిప్పు, ఆకాశం, నీరు, భూమీ, గాలి.. ఈ లిరికల్ వీడియోలో చూపించారు. దీని కాన్సెప్టు ఏమిటంటే.. ప్రేమించే వాళ్ళ కోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అన్నింటినీ అధిగమించి వాళ్లను చేరుకోవడం. ఈ పాటలో హీరోయిన్ కోసం హీరో అలాంటి కష్టాలు పడతాడు. సినిమా విడుదలైన తర్వాత ఈ పాట గురించి పూర్తిగా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

ఇక ఈరోజు రిలీజైన వీడియోలో ఏకంగా ప్రభాస్-పూజాహెగ్డే మధ్య వచ్చే సన్నివేశాలు చూపించారు. వీడియో సాంగ్ చూస్తుంటే ఇదొక మాంటేజ్ సాంగ్ అనే విషయం అర్థమౌతుంది. ప్రభాస్, పూజాహెగ్డే అందంగా కనిపిస్తున్నాయి. ఇక విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోవు. ఈ విజువల్స్ కు అద్భుతమైన సాంగ్ తోడవ్వడంతో.. ఓ బ్యూటిఫుల్ ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో ఈ పాటే హైలెట్ అయ్యేలా ఉంది.

గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకుడు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. మార్చ్ 11న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.