Pawan Kalyan’s ‘Bheemla Nayak’ Mania started
వారానికి మూడు నాలుగు చిన్న సినిమాలు రిలీజవుతున్నప్పటికీ ఓ స్టార్ హీరో సినిమా కోసం ఎప్పటికప్పుడు ఎదురుచూస్తుంటారు సినిమా అభిమానులు. ఇక ఫ్యాన్స్ అయితే రిలీజ్ రోజు ఓ పండుగలా భావిస్తారు. రేపు పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ రిలీజవుతోంది. ఈ రోజు నుండే పవన్ మేనియా మొదలైంది. థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ కటౌట్లు కడుతూ రేపటి రిలీజ్ ఈవెంట్ కి అంతా రెడీ చేస్తున్నారు.
ఇక మరో పక్క ‘భీమ్లా నాయక్’ టికెట్స్ హంగామా నడుస్తుంది. ఆన్లైన్ లో రేపటికి సంబంధించి ఆల్మోస్ట్ టికెట్లు భారీ స్థాయిలో ఏమ్ముడైపోయాయి. తాజాగా తెలంగాణాలో ఐదో షోకి సంబంధించి పర్మీషణ్ కూడా వచ్చేసింది. తెల్లవారు జామున ఫ్యాన్స్ షోలు వేయడానికి రెడీ అవుతున్నారు. కుకట్ పల్లిలో రెండు , మూడు షోలు ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరికొన్ని గంటల్లో రాబోతున్న ఈ క్రేజీ సినిమాపై బజ్ కూడా గట్టిగా ఉంది. ఎక్కడ చూసిన ఈ సినిమా రిలీజ్ మేటరే టాపిక్ గా వినిపిస్తుంది. తాజాగా విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. పవన్ -రానా కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు , యాక్షన్ ఎప్సిసోడ్ సినిమాకు హైలైట్ అంటూ ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ట్రైలర్ లో కూడా ఆ సన్నివేశాలకు సంబంధించి హింట్ ఇచ్చేలా కొన్ని షాట్స్ పెట్టారు.
సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందించడం విశేషం. ఏదేమైనా కొన్ని గంటల ముందే పవన్ స్టార్ సినిమా మేనియా మొదలైపోయింది. ఇక రేపు సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం అన్నట్టుగా ఉంది. మరి రేపటి నుండి పవన్ కలెక్షన్ల వేట మొదలుకానుంది. ఈ సినిమాతో పవన్ కలెక్షన్ల సునామి సృష్టిస్తాడని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics