Prabhas New Movie - ఆ హీరోయిన్ కూడా?

Thursday,June 10,2021 - 03:41 by Z_CLU

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ భారీ బడ్జెట్ సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకునే హీరోయిన్ గా నటించనుంది. అలాగే మరో కీ రోల్ లో బిగ్ బీ అమితాబ్ కనిపించనున్నారు. వీరిద్దరి ఫైనల్ చేసి ప్రాజెక్ట్ లోకి వెల్కం చెప్పేసిన నాగ్ అశ్విన్ మరో హీరోయిన్ కి కూడా త్వరలోనే వెల్కం చెప్పనున్నాడని టాక్. అవును సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ కి హీరోయిన్ రాశి ఖన్నా ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.

Raashi-Khanna_Stills-రాశి-ఖన్నా

                    రాశి ఖన్నా

అయితే సినిమాలో ఆ పాత్ర కొంత సేపే ఉంటుందట. కానీ కథలో కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్ తో ఇప్పటి వరకూ సినిమా చేసే అవకాశం రాలేదని అనుకుంటున్న సమయంలో నాగ్ అశ్విన్ నుండి ఈ ఆఫర్ రాగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట రాశీ. త్వరలోనే రాశి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుందని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంతో తెరకెక్కనుందని ఇన్సైడ్ టాక్. అందుకే ఈ జోనర్ లో ఆల్రెడీ సినిమా చేసిన సింగీతం శ్రీనివాస్ గారిని నాగ్ అశ్విన్ సూపర్ వైజర్ గా తీసుకున్నాడనుకోవచ్చు.

వైజయంతి మూవీస్ బేనర్ పై అశ్వని దత్ నిర్మించనున్న ఈ సినిమా నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ లోపు ప్రభాస్ ‘ఆది పురుష్’, ‘సలార్’ సినిమాలకు సంబంధించి షెడ్యుల్ పూర్తి చేసుకురానున్నాడు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ నుండి వస్తున్న సినిమాగా పైగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరో కావడంతో ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics