బాబాయ్-అబ్బాయ్ ఒకే హీరోయిన్ తో!

Saturday,April 25,2020 - 01:15 by Z_CLU

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానాతో ఒకేసారి కలిసి వర్క్ చేస్తోంది హీరోయిన్ ప్రియమణి. అవును అసురన్ రీమేక్ గా తెరకెక్కుతున్న ‘నారప్ప’ లో వెంకీ భార్యగా నటిస్తున్న ప్రియమణి.. రానా సినిమాలో కూడా ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తుంది.

ఈ రెండు సినిమాలకు సంబంధించి షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రియమణి పోర్షన్ వరకు షూట్ అయిపోయింది. టాలీవుడ్ లో స్మాల్ గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు దగ్గుబాటి హీరోల సినిమాలతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతుంది.

మరి బాబాయ్ – అబ్బాయ్ తో ప్రియమణి ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.