17 ఏళ్ల జానీ.. హైప్ లో ఒకప్పుడు బాహుబలి

Saturday,April 25,2020 - 04:23 by Z_CLU

జానీ సినిమాను బాహుబలి-2తో కంపేర్ చేయడం ఏమాత్రం తప్పు అనిపించుకోదు. బాహుబలి సినిమా భారీ విజయం తర్వాత బాహుబలి-2 కోసం దేశం మొత్తం ఎలా ఎదురుచూసిందో.. సరిగ్గా 17 ఏళ్ల కిందట జానీ సినిమా కోసం ప్రేక్షకులు అలా ఎదురుచూశారు. అప్పట్లో పవన్ క్రేజ్ “బాహుబలి-2” రేంజ్ లో ఉండేది మరి. దానికి కారణం అప్పటికే పవన్ నుంచి వచ్చిన ఖుషి, తమ్ముడు, తొలిప్రేమ, సుస్వాగతం లాంటి బ్లాక్ బస్టర్స్.

17 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 25) విడుదలైంది జానీ. మూవీ రిజల్ట్ తేడాకొట్టినా సినిమా మాత్రం ఎన్నో రికార్డులు సృష్టించింది. 17 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జానీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూద్దాం

– పవన్ కల్యాణ్ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా జానీ. పవర్ స్టార్ అఫీషియల్ గా డైరక్ట్ చేసిన మొదటి-చివరి చిత్రం ఇది. అంతేకాదు.. ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే కూడా పవన్ కల్యాణే.

– ఈ సినిమాలో పవన్ కిక్ బాక్సర్ గా కనిపిస్తాడు. ఈ క్యారెక్టర్ కోసం ఏడాది ట్రైనింగ్ తీసుకున్నాడు పవర్ స్టార్. అతడి స్టంట్స్ ఈ సినిమాకు హైలెట్.

– బద్రి తర్వాత పవన్-రేణుదేశాయ్ కలిసి చేసిన రెండో సినిమా ఇది. ఈ సినిమాలో కేవలం హీరోయిన్ గా నటించడమే కాకుండా.. కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేశారు రేణుదేశాయ్. ఎడిటింగ్ కూడా చూసుకున్నారు.

– తెలుగు సినీచరిత్రలోనే తొలిసారిగా లైవ్ రికార్డింగ్ చూపించిన సినిమా జానీ. ఈ సినిమాలో దాదాపు 90శాతం మనకు లైవ్-రికార్డింగ్ కనిపిస్తుంది. అంటే సెట్స్ లో ఉన్న డైలాగ్ లే ఫైనల్. మళ్లీ రికార్డింగ్ స్టుడియోకి వచ్చి డబ్బింగ్ చెప్పలేదన్నమాట.

– రిలీజ్ కు ముందు ఎన్నో రికార్డులు సృష్టించింది జానీ. ఆ టైమ్ కు టాలీవుడ్ లో హయ్యస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. ఈ క్రమంలో చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాను కూడా ఇది క్రాస్ చేసింది.

– హయ్యస్ట్ ప్రింట్స్ తో సినిమాను రిలీజ్ చేయాలనే కాన్సెప్ట్ ఈ సినిమాతోనే మొదలైంది. తెలుగు సినీచరిత్రలోనే 250 ప్రింట్స్ తో వరల్డ్ వైడ్ రిలీజైన తొలి సినిమా జానీ.

– సినిమాలో పవన్ వాడిన కర్చీఫ్, బనియన్, ప్యాంట్స్ కు అప్పట్లో యూత్ లో ఫుల్ డిమాండ్ ఉండేది. చాలామంది అప్పట్లో ఈ ఫ్యాషన్ ను ఫాలో అయ్యారు.

– ఇంత హైప్ తో వచ్చిన జానీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. పవన్ నుంచి ఫుల్ లెంగ్త్ ఎఁటర్ టైన్ మెంట్ ఆశించిన ప్రేక్షకులు భంగపడ్డారు. దీనికి తోడు సినిమా నిడివి ఎక్కువగా ఉండడం, స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్ గా ఉండడంతో మూవీ ఫ్లాప్ అయింది.

– సినిమా ఫ్లాప్ అయినా జానీని ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ స్టంట్స్, ఫ్రేమింగ్, మేకింగ్ ను బాలీవుడ్ ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు.

– ఫైట్స్ లో ఓ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది జానీ సినిమా. అప్పటివరకు తెలుగుతెరపై చూడని స్టంట్స్ ను పవన్ ప్రజెంట్ చేశారు.

– సినిమాకు రమణ గోగుల సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు పాపులర్. ఇక సినిమాలో జానీ థీమ్ మ్యూజిక్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.