పోటీకి సై అంటున్న సాయితేజ్

Wednesday,October 16,2019 - 06:09 by Z_CLU

డిసెంబర్ లాస్ట్ వీక్ చాలా పోటీ నడుస్తోంది. క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వచ్చేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రవితేజ తన డిస్కోరాజాను క్రిస్మస్ కు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. వెంకీ మామ కూడా దాదాపు ఇదే టైమ్ కు వస్తుందంటున్నారు. మరోవైపు బాలయ్య మూవీ కూడా లిస్ట్ లో ఉంది. ఇప్పుడీ రేసులోకి సాయితేజ్ కూడా ఎంటరయ్యాడు.

మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే సినిమా చేస్తున్నాడు సాయితేజ్. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు. తరువాత షెడ్యూల్ ని అమెరికాలో ప్లాన్ చేశారు.

ప్రధానంగా తాత-మనవడు వచ్చే అనుబంధాన్ని బేస్ చేసుకొని తెరకెక్కుతోంది ప్రతిరోజూ పండగే సినిమా. జీఏ2, యూవీ పిక్చర్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీలకపాత్రల్లో సత్యరాజ్, రావురమేష్ కనిపించబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.